కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి పాఠశాలకు చెందిన ఓ ఇద్దరు విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి మండల కేంద్రం నుంచి కాలినడకన వెళ్తుంటే అటువైపుగా వెళ్తున్న ఎస్సై రాజేందర్ వారిని తన బైక్‌పై ఎక్కించుకున్నారు. ఆలస్యం కాకుండా పరీక్ష కేంద్రం వరకు తీసుకెళ్లారు.
ములకలపల్లి: స్థానిక జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో గేట్ బయట విద్యార్థుల గదుల కేటాయింపు వివరాలతో కూడిన నోటీసు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఉదయం 8.45 తరువాతే పరీక్ష కేంద్రం ఆవరణలోకి ఆనుమతించడం, 8.50కి గదుల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.