మణుగూరు రూరల్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి జెన్‌కో సంస్థ ప్రాధాన్యమిస్తోందని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ బి.బిచ్చన్న తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్‌పీఈయూ)–1535 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటూ అధిక ఉత్పత్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.ప్రసాద్, ఆర్.రామచందర్, ఎం.రాజమనోహర్, ఎస్‌డి రఫీ, టి.అనిల్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్లు, జార్జ్, పుల్లారావు, జి రవికుమార్, వీరబాబు, వింజమూరు మురళి, చిక్కా వెంకటరమణ, ఆర్.రవిచంద్ర, జానీ బేగం, ఈశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు.
బీటీపీఎస్ సీఈ బిచ్చన్న