‘రాబిన్‌ హుడ్‌’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. | - | Sakshi
Sakshi News home page

‘రాబిన్‌ హుడ్‌’ ప్రేక్షకులకు నచ్చుతుంది..

Published Tue, Mar 18 2025 12:42 AM | Last Updated on Tue, Mar 18 2025 12:40 AM

సినీ నిర్మాత రవిశంకర్‌

హీరో నితిన్‌తో కలిసి గుబ్బల మంగమ్మ ఆలయ సందర్శన

అశ్వారావుపేటరూరల్‌: ఛలో, భీష్మ సినిమాల తర్వాత హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో నిర్మించిన రాబిన్‌ హుడ్‌ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని మైత్రీ మూవీ మేకర్‌ బ్యానర్‌ నిర్మాత రవిశంకర్‌ అన్నారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో గల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని హీరో నితిన్‌తోపాటు చిత్ర బృందం సోమవారం సందర్శించింది. హీరో నితిన్‌ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెన్సార్‌ వర్క్‌ జరుగుతోందని, ప్రమోషన్ల పనుల్లో ఉన్నట్లు చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందన్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. తన తొలి చిత్రం ఛలో, ఆ తర్వాత వచ్చిన భీష్మ సినిమాలు గుర్తింపు తెచ్చాయని, తాజా సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోదంతోపాటు మంచి సందేశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హీరో చిరంజీవితో కూడా త్వరలోనే సినిమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ ప్రకాశ్‌రావు, కుడుముల రంగారావు, మదాల నాగేశ్వరరావు, రాజు పాల్గొన్నారు.

‘రాబిన్‌ హుడ్‌’ ప్రేక్షకులకు నచ్చుతుంది..1
1/1

‘రాబిన్‌ హుడ్‌’ ప్రేక్షకులకు నచ్చుతుంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement