చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Jul 19 2023 12:12 AM | Updated on Jul 19 2023 9:08 AM

- - Sakshi

భద్రాద్రి: అశ్వాపురం మండలంలోని జగ్గారం క్రాస్‌ రోడ్డు వద్ద మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మణుగూరు డిపోకు చెందిన బస్సు మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది.

జగ్గారం క్రాస్‌ రోడ్డు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బస్సుకు ఎద్దు అడ్డు రావడంతో తప్పించబోయి అదుపుతప్పి రహదారి కిందకు దిగి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement