దమ్మక్క సేవా యాత్రకు రారండి | - | Sakshi
Sakshi News home page

దమ్మక్క సేవా యాత్రకు రారండి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

● గిరిజనులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు దేవస్థానం నుంచి ఆహ్వానం ● రేపు భద్రాచలంలో శోభాయాత్ర, మారుతి సదనంలో పుష్పాంజలి

● గిరిజనులు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు దేవస్థానం నుంచి ఆహ్వానం ● రేపు భద్రాచలంలో శోభాయాత్ర, మారుతి సదనంలో పుష్పాంజలి

భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో సీతారాముల విగ్రహాలకు నీడ కల్పించి, పూజించిన అపర భక్తురాలు దమ్మక్క సేవా యాత్రకు దేవస్థానం అధికారులు ఆహ్వానం పలుకుతున్నారు. 2014 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, గిరిజనులు, భక్తులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆషాఢ పూర్ణిమ రోజు పోకల దమ్మక్కను స్మరిస్తూ యాత్ర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో వేడుకలు జరుపుతారు. ఈ నెల 29న దమ్మక్క యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. దేవస్థాన పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సేవా యాత్రలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రచార రథంలో స్వా మివారి ఉత్సవ మూర్తులను ఉంచి శోభాయాత్ర జరపనున్నారు. ఏటా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణోత్సవం, పుష్పాంజలి వేడుకలను తానీషా కల్యాణ మండపం ప్రాంగణంలోని మారుతి సదనానికి మార్చారు.

ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో

తరలింపు

దమ్మక్క సేవా యాత్రకు 9 ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో సుమారు 700 మంది గిరిజనులను భద్రాచలం తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇల్లెందు, అశ్వారావుపేట రూట్లలో రెండు చొప్పున, జూలూరుపాడు రూట్‌లో 3, వాజేడు, కూనవరం రూట్లో ఒక్కో బస్సును కేటాయించారు. ఆర్టీసీ బస్సులు వెళ్లలేని రూట్లలో ప్రైవేట్‌ వాహనా ల ద్వారా వచ్చినవారి రవాణా చార్జీలనూ దేవస్థానం భరించనుంది. మంగళవారం సాయంత్రానికి వీరిని తరలించనుండగా, ఇందుకోసం తొమ్మి ది మంది సిబ్బందికి విధులు కేటాయించారు. రెండు రోజులపాటు ఉచిత బస, భోజన వసతి కల్పించనున్నారు. కాగా, ఈఓగా రమాదేవి ఉన్న కాలంలో గిరిజన గ్రామంలో రామయ్య ప్రచార రథంతో శోభాయాత్ర, నిత్యకల్యాణం జరిపి, స్వామివారిని గిరిజనుల చెంతకే చేర్చేవారు. ఈఏడాది దేవస్థానం అధికారులు దీనికి ‘మంగళం’పాడారు. కాగా ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీర య్య, ఐటీడీఏ పీఓ రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాళ్‌ శ్రేష్ఠ, సర్పంచ్‌ పూనెం కృష్ణ తదితరులకు సోమవా రం వేడుకల ఆహ్వాన పత్రాలను అందించినట్లు ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement