జిల్లాలో వర్షపాతం వివరాలు(మిల్లీమీటర్లలో)
ఎల్‌నినో ప్రభావంతో
ఆశించినమేర కురవని వర్షాలు
జిల్లాలో నిండని ప్రాజెక్టులు..
అడుగంటిన చెరువులు
ఆందోళన చెందుతున్న రైతులు,
మత్స్యకారులు
చెరువులు 2,384.. అలుగు పోసినవి రెండే
ఎల్‌నినో ప్రభావం వల్ల..
పడిపోతున్న భూగర్భ జలాలు
చినుకు రాలక..
పాల్వంచరూరల్: వానాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా జిల్లాలో వర్షాలు మొహం చాటేశాయి. చెరువులు అడుగంటి వెలవెలబోతున్నాయి. జలాశయాలు వట్టిపోతున్నాయి. ఎల్‌నినో ప్రభా వంతో పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి సాగుకు అనుకూలంగా లేవు. మెట్ట పంటలు కూడా వడలిపోతున్నాయి. మరోవైపు వరినా రు ముదిరిపోయే పరిస్థితి నెలకొనగా, రైతులు కిన్నెరసాని, మొర్రేడువాగు, బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. వచ్చే నెలలోనైనా వర్షాలు కురుస్తాయేమోనని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
● గతేడాది ఇదే నెలలో చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో కళకళలాడాయి. కొన్ని అలుగు కూడా పోశాయి. కానీ ఈ ఏడాది మాత్రం చెరువుల్లో నీరు చేరలేదు. తాలిపేరు మినహా ఏ ప్రాజెక్ట్ నుంచీ దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో రైతులతోపాటు మత్స్యకారులు కూడా కలవరం చెందుతున్నారు.
● పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 397.06 అడుగులకు చేరింది. ఆయకట్టు పదివేల ఎకరాలు ఉంది.
● అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం అడుగంటింది. ఆయకట్టు 16వేల ఎకరాలు. ఇందులో 2,360 ఎకరాలు తెలంగాణలో ఉండగా, మిగతాది ఆంధ్రాలో ఉంది. 2024లో ప్రాజెక్ట్‌కు గండి పడటంతో రెండేళ్లుగా నీరు నిల్వ ఉండటంలేదు.
● చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 73.65 మీటర్ల గరిష్ట స్థాయికి చేరడంతో, 15 గేట్లను ఎత్తివేసి నీటిని 22న దిగువకు విడుదల చేశారు. దీనికింద ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది.
● ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం అడుగంటింది. ఆయకట్టు 3,250 ఎకరాలుగా ఉంది.
సమయం సాధారణ నమోదు లోటు/
వర్షపాతం అధిక శాతం
ఈ సీజన్‌లో.. 401 278.3 –31
గతేడాది జూన్ 169 134 –26
ఈ ఏడాది జూన్ 161 151 –6
గతేడాది జూలై 313 379 +17
ఈ నెలలో 23నాటికి 232 135 –71
జిల్లాలో చెరువులు కుంటలు 2,384 ఉన్నాయి. వీటిల్లో 1,796, చెరువులు 25 శాతం మేర నిండాయి. 25 నుంచి 50శాతం నీరు చేరిన చెరువులు 557, 50 నుంచి 75 శాతం నీరు చేరినవి 5 ఉన్నాయి. రెండు చెరువులు మాత్రమే అలుగు పోశాయి. దీంతో చెరువుల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
గతేడాది ఈ సమాయానికి జిల్లాలోని జలాశయాలు నిండాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కురవడంలేదు. దీంతో జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరలేదు. ఆగస్టులో అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు కురిస్తే అన్ని నిండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి కంటే ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే మేలు.
–శ్రీనివాసరెడ్డి, జలవనరులశాఖ సీఈ
వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి భూగర్భ జలాలు 10.32 మీటర్ల లోతు కు పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 6.79 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాది కంటే 3.5 మీటర్ల లోతుకు అధికంగా పడిపోయాయి. వచ్చే నెలలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే భూగర్భ జలాలు 11.20 అడుగుల లోతుకు పడిపోయే ప్రమాదం ఉంది.
–ఎం.రమేష్, ఏడీ, భూగర్భ జలాల శాఖ


