మార్టూరు(యద్దనపూడి): పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంటిలో విషాదఛాయలు అలముకున్న సంఘటన మార్టూరు గ్రామంలోని ఆది జాంబవ కాలనీలో చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చయమైన ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందిన సమాచారం ప్రకారం మార్టూరులోని ఆదిజాంబవ కాలనీకి చెందిన పెదకర్ని మరియదాసు కుమారుడు యశ్వంత్ కుమార్(19)కు ఇటీవల పెళ్ళి నిశ్చయమైంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంటిలో పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. యశ్వంత్‌కుమార్ ఇంటిపై ఉన్న ఇనుప రాడ్డును కిందకి తీసుకువస్తున్న క్రమంలో అది సమీపంలోని విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై యశ్వంత్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి పనులకు సంబంధించి ఇంటిలో ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యశ్వంత్ కుమార్ అందరితో కలివిడిగా ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీలో అందరికీ సుపరిచితుడుగా ఉండే వాడని స్థానికులు తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు అకాల మరణం చెందడంతో ఆదిజాంబవకాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
కళకళలాడాల్సిన ఇంటిలో విషాదఛాయలు


