టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక 10న లలితకళా ఉత్సవం బీసీల రాజ్యాధికారానికి సంఘ నిర్మాణమే పునాది రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

చుండూరు(వేమూరు): చుండూరు మండలం అంబేద్కర్‌నగర్‌ చెందిన టీడీపీకి చెందిన వంపుగాని గురవయ్య తన అనుచరులతో కలిసి మంగళవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గురవయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాల పాలన భరించలేక వైఎస్సార్‌ సీపీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం

గుంటూరు ఎడ్యుకేషన్‌: శ్యామలానగర్లోని శ్రీవేంకటేశ్వర బాలకుటీర్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 10వ తేదీన నిర్వహించనున్న లలితకళా ఉత్సవంలో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నన్నపనేని మంగాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. చిత్రలేఖనం, కాగితపు బొమ్మలు, కథా రచన, కవితా రచన, లేఖా రచనలలో పోటీలు ఈ నెల 23న శ్రీవేంకటేశ్వర బాల కుటీర్‌తో పాటు గుంటూరు రూరల్‌ చోడవరంలోని చేతన చారిటబుల్‌ ట్రస్ట్‌, తెనాలి నాజరుపేటలోని హిందీ ప్రేమీ మండలి మహావిద్యాలయ ప్రాంగణంలో జరుగుతాయన్నారు. గాత్రం, వాద్య సంగీతంలో వ్యక్తిగతంగా, బృందగానాల రూపంలోనూ పోటీలను డిసెంబరు 10న శ్రీవేంకటేశ్వర బాల కుటీర్‌లో నిర్వహిస్తామని వివరించారు. విజేతలకు బహుమతులు ఉంటాయని, వివిధ రంగాల ప్రముఖులను కూడా పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాలకు 0863 – 2232405, 93901 15480, 93901 15487 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

మంగళగిరి టౌన్‌: బీసీల రాజకీయ సాధికారత, రాజ్యాధికార సాధనకు బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన గుంటూరు జిల్లా విస్తృతస్థాయి సదస్సు అనంతరం శంకరరావు మీడియాతో మాట్లాడుతూ కాన్షీరామ్‌ అనుసరించిన విధానాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా ఎదగాలంటే ముందుగా రాజకీయేతర సామాజిక పునాదులు బలంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాల ప్రజల సమస్యలు, అవసరాలు, ఆకాంక్షలను గుర్తించి సంఘ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామాలు, వార్డులు, డివిజన్లలో సంఘాన్ని విస్తరించి బీసీలను చైతన్యపరచాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుమ్మర క్రాంతికుమార్‌ మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, 50 ఏళ్లు నిండిన వారికి సామాజిక పెన్షన్లు కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో 34.33 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు మహేష్‌, శ్రీనివాస్‌, శివరాం బాబాజీ, అశోక్‌, వెంకటేశ్వర్లు, పూర్ణచంద్రరావు, వెంకట శివరావు గౌడ్‌, చందు, వెంకటకృష్ణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

చీరాల రూరల్‌: రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి ఉప్పుగుండూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య మంగళవారం తెలిపారు. రైలు బండిని గమనించకుండా పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. వృద్ధురాలి వయస్సు సుమారుగా 70 ఏళ్లు ఉంటాయని చెప్పారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసినవారు జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులకు 92475 75633 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement