కేఎల్‌యూలో నటుడు శ్రీనివాస్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూలో నటుడు శ్రీనివాస్‌ సందడి

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

కేఎల్‌యూలో నటుడు శ్రీనివాస్‌ సందడి వ్యాధుల వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యం గుంటూరు మెడికల్‌: జిల్లాలో వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆరోగ్య పర్యవేక్షకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో జిల్లాలోని వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య పర్యవేక్షకులకు ఐహెచ్‌ఐపీ సేవల బలోపేతంపై శిక్షణ ఇచ్చారు. వ్యాధుల వ్యాప్తిని ప్రారంభ దశలోనే గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటంపై అవగాహన కల్పించారు. శిక్షణ ద్వారా ఆరోగ్య సిబ్బందికి వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు గుర్తింపు, వ్యాధుల వ్యాప్తి నియంత్రణపై మరింత అవగాహన కలుగుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం. పద్మావతి తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అన్నపూర్ణ, డాక్టర్‌ సుజాత పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థి, నటుడు అవసరాల శ్రీనివాస్‌ మంగళవారం సందడి చేశారు. ఇటీవల పూర్వ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల వేడుకకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయానని శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ తాను 1999లో కేఎల్‌యూలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో చేరానని పేర్కొన్నారు. విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు అందించారు. తన విద్యాభ్యాసం, సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుభవాలు, ఎదురైన పరిస్థితులను పంచుకున్నారు. అనంతరం అప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రాంగణంలో సందడి చేశారు. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి. పార్థసారథి వర్మ, ప్రో చాన్సలర్లు డాక్టర్‌ కేఎస్‌ జగన్నాథరావు, ప్రో వీసీలు డాక్టర్‌ ఎన్‌. వెంకట్‌రామ్‌, డాక్టర్‌ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌, ఆర్‌ అండ్‌ డీ డీన్‌ డాక్టర్‌ మాధవ్‌, పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కేసీహెచ్‌ శ్రీకావ్య, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోని, డాక్టర్‌ హబీబుల్లా ఖాన్‌, లైఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బుచ్చినాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పద్మావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement