జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు లావణ్య ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు లావణ్య ఎంపిక

Nov 17 2026 1:56 AM | Updated on Nov 17 2026 1:56 AM

చీరాల రూరల్‌: జాతీయస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఈపురుపాలెం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ (వ్యాయామ ఉపాధ్యాయురాలిగా) పనిచేస్తున్న ఎ.లావణ్య ఎంపికయ్యారు. ఈనెల 14, 15 తేదీల్లో నెల్లూలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 46వ ఏపీ స్టేట్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌–2026 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఈపురుపాలెం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎ.లావణ్య 35 సంవత్సరాల విభాగంలో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటింది. షాట్‌పుట్‌లో ప్రథమస్థానం, లాంగ్‌జంప్‌లో ప్రథమస్థానం, జావెలిన్‌ త్రోలో ద్వితీయ స్థానం సాధించి 2027 జనవరి 1, 2, 3 తేదీల్లో గుజరాత్‌లో జరగబోయే జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై ంది. ఒకవైపు విద్యార్థిలను క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ మరోవైపు ఆమె కూడా క్రీడల్లో సత్తాచాటుతూ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌కు ఎంపికవడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.హనోర, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement