ముగిసిన రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

నెల్లూరు(టౌన్‌): వుూడురోజులుగా జరుగుతున్న రాష్ట్ర రైఫిల్‌ షూటింగ్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని డైకస్‌రోడ్డు సెంటర్‌ సమీపంలో ఉన్న ఎఫ్‌ఎస్‌ఏ రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీలో అండర్‌ – 14, 17 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు జరిగాయి. ఆయా విభాగాల్లో తొలి మూడు స్థానాలు సాధించిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పీప్‌సైట్‌ అండర్‌ – 14 బాలురు విభాగంలో పి.ఆశ్రిత్‌ ప్రథమ (గుంటూరు) పి.అభిసార్‌ విశాఖపట్నం (ద్వితీయ), ఎ.ధీరసాత్విక్‌ తృతీయ (తూర్పుగోదావరి), బాలికల విభాగంలో ఎన్‌.కృష్ణ ప్రథమ (కృష్ణా), వెజ్జు ధరియా ద్వితీయ (గుంటూరు), కె.జస్విత తృతీయ (నెల్లూరు)లు ఎంపికయ్యారు. అండర్‌ – 17 బాలుర విభాగంలో పి.సాయికౌషిక్‌ ప్రథమ (విశాఖపట్నం), రమేష్‌రెడ్డి ద్వితీయ (కృష్ణ), వెంకట లోకేశ్‌ తృతీయ (విశాఖపట్నం), బాలికల విభాగంలో ఎ.ఆశ్రిత ప్రథమ (తూర్పుగోదావరి), శ్రీకార్తికేయ ద్వితీయ (గుంటూరు), ఎస్‌.తన్మయ తృతీయ (గుంటూరు) ప్రతిభ చూపారు. పిస్టోల్‌ అండర్‌ – 17 బాలుర విభాగంలో జీషన్‌ఖాన్‌ ప్రథమ (అనంతపురం), సేతుమాధవ్‌ ద్వితీయ (గుంటూరు), కార్తికేయ తృతీయ (అనంతపురం), బాలికల విభాగంలో ధాత్రిశివానీ ప్రథమ (అనంతపురం), దీక్షిత ద్వితీయ (తూర్పుగోదావరి), రుషికాంజన తృతీయ (నెల్లూరు) ఉన్నారు. అండర్‌ – 14 బాలురు విభాగంలో మౌనీష్‌ ప్రథమ (విశాఖపట్నం), ఆయాన్‌ అలీబేగ్‌ ద్వితీయ (గుంటూరు), మోక్షిత్‌ తృతీయ (కృష్ణా), బాలికల విభాగంలో సాయిదేవ వర్షిణి ప్రథమ (గుంటూరు), ఆకృతి ద్వితీయ (తూర్పుగోదావరి), దార్నిషా తృతీయ (విశాఖపట్నం)లు ఎంపికయ్యారు. ఓపెన్‌సైట్‌ అండర్‌– 17 బాలికల విభాగంలో గురుసాహితి ప్రథమ (అనంతపురం), ఎస్‌కే జహీర్‌తాజ్‌ ద్వితీయ (కడప), ఎస్‌కే జోహసిద్ర తృతీయ (తూర్పుగోదావరి), బాలురు విభాగంలో రామ్‌జగదీష్‌ ప్రథమ (కర్నూలు), యశ్వంత్‌ ద్వితీయ (తూర్పుగోదావరి), అభిషయ జాషువా తృతీయ (కర్నూలు), అండర్‌ – 14 బాలుర విభాగంలో నాగచైతన్య ప్రథమ (కడప), మోహిత్‌ ద్వితీయ (విశాఖపట్నం), ధనూష్‌ తృతీయ (పశ్చిమగోదావరి), బాలికల విభాగంలో దేవి ప్రథమ (పశ్చిమగోదావరి), తోషిక ద్వితీయ (అనంతపురం), లక్ష్మీదేవి తృతీయ (అనంతపురం)లు ఎంపియ్యారు. కార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు, స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ మల్లికార్జున, ఆర్గనైజింగ్‌ సెక్రటరి పి.తిరుపతయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement