తైక్వాండో పోటీల్లో గుంటూరు జట్టుకు ప్రథమస్థానం | - | Sakshi
Sakshi News home page

తైక్వాండో పోటీల్లో గుంటూరు జట్టుకు ప్రథమస్థానం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

తెనాలిఅర్బన్‌: సాయికమ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తైక్వాండో చాంపియన్‌ షిప్‌ పోటీలను ఆదివారం తెనాలిలో నిర్వహించారు. వివిధ జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ప్రథమస్థానాన్ని గుంటూరు జిల్లా జట్టు, రెండో స్థానాన్ని నెల్లూరు జిల్లా జట్టు, మూడో స్థానాన్ని బాపట్ల జిల్లా జట్టు సాధించాయని నిర్వాహకులు, అసోసియేషన్‌ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారికి కప్‌లు అందజేశారు. కార్యక్రమంలో వైకుంఠపురం దేవస్థాన కమిటీ చైర్మన్‌ ఈదర వెంకట పూర్ణచంద్‌, గణేష్‌యూత్‌ కన్వీనర్‌ వీరవల్లి మురళి, మాజీ కౌన్సిలర్‌ గుమ్మడి రమేష్‌, అసోసియేషన్‌ ప్రతినిధులు చావాలి అకుల్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు పారా స్పోర్ట్స్‌ మీట్‌

గుంటూరు వెస్ట్‌: విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్స్‌, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బీఆర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పారా క్రీడా పోటీలు జరుగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్‌ ఖాన్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 సంవత్సరాలు దాటిన బాలబాలికలు పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. పారా అథ్లెటిక్స్‌, పారా బ్యాడ్మింటన్‌ (సింగిల్స్‌), పారా టేబుల్‌ టెన్నిస్‌ (సింగిల్స్‌), పారా తైక్వాండో, వీల్‌ చైర్‌ ఫెన్సింగ్‌, బ్లైండ్‌ గోల్డ్‌ బాల్‌ విభాగాల్లో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు దివ్యాంగ సర్టిఫికెట్‌, ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement