సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాలకు లయన్స్ క్లబ్ సేవలు విస్తరించాలని క్లబ్ జిల్లా 316 హెచ్ గవర్నర్ పీఎంజేఎఫ్ ఆర్.లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఫణిదం గ్రామంలో గల పీవీపీ గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జిల్లా 316 హెచ్ కేబినెట్ సమావేశం, రీజియన్ గెట్ టు గెదర్, జోన్ అడ్వయిజరీ సమావేశాలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన సభ్యుల చేరిక, కొత్త క్లబ్‌ల ఏర్పాటు, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రీజియన్ గెట్ టు గెదర్‌కు రీజియన్ చైర్మన్ లయన్ పొన్నెకంటి కిషోర్‌కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా గవర్నర్ లక్ష్మీనారాయణను లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ బాధ్యులు సన్మానించారు. జోన్ అడ్వయిజరీ సమావేశానికి జోన్ చైర్మన్ లయన్ బి.వీరాంజనేయులు, సురేష్ అధ్యక్షత వహించారు. కేబినెట్ సమావేశానికి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి కేబినెట్ సెక్రటరీ శ్రీహరి,ట్రెజరర్ శ్రీనివాసులురెడ్డి,రీజియన్ చైర్మన్లు,జోన్ చైర్మన్లు,జిల్లా చైర్మన్‌లు, జీఎల్‌టీ, జీఎస్టీ, జీఎమ్‌టీ, జీఈటీ కోఆర్డినేటర్లు, సభ్యులు హాజరయ్యారు. రీజియన్ ఫ్యాకల్టీగా లయన్ గోపీచంద్, లయన్ రామకృష్ణ, లయన్ ప్రకాష్ పాల్గొన్నారు.


