ప్రభుత్వ సర్వీసులో దశాబ్దాలపాటు నిస్వార్థమైన కృషి శస్త్రచికిత్స నిపుణుడిగా రోగులకు సేవలు నేడు స్వస్థలమైన జాండ్రపేటలో అంత్యక్రియలు
తెనాలి: ప్రభుత్వ వైద్యశాల పెద్దాసుపత్రిగా నడిచిన కాలంలో ప్రభుత్వ సర్వీసులో కొనసాగు తూ పేదల వైద్యుడుగా గుర్తింపు ను పొందిన సీనియర్ సర్జన్, వైద్య, ఆరోగ్యశాఖ విశ్రాంత అదనపు సంచాలకులు డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం(83) కన్నుమూశా రు. డాక్టర్ సుబ్రహ్మణ్యం, తెనాలి గంగానమ్మపేటలోని తన నివాసంలో గురువారం సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రాత్రి పొద్దుపోయాక మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం శుక్రవారం ఇక్కడే ఉంచారు. శనివారం తెల్లవారుజామున ఆయన స్వస్థలమైన చీరాల సమీపంలోని జాండ్రపేటకు తరలిస్తారు. అక్కడే ఉదయం 10 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చీరాల దగ్గర్లో చేనేతకు నిలయమైన జాండ్రపేటలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఏకై క కుమారుడిగా డాక్టర్ సుబ్రహ్మణ్యం 1942లో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట శేషమ్మ, గుత్తి కోటసుబ్బయ్య. హైస్కూలు విద్యవరకు స్వగ్రామంలో పూర్తిచేశారు. చీరాలలోని వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎస్ కాలేజిలో ఇంటర్ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్‌లో చేరారు. అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులై, బంగారు పతకం స్వీకరించారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యవృత్తిలో చేరారు. రెండు నెలల తర్వాత స్టడీ లీవ్ తీసుకుని, గుంటూరు మెడికల్ కాలేజిలో ఎంఎస్ చేశారు. అందులోనూ బంగారు పతకం సాధించారు. ఆ తర్వా త గుంటూరు మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అయిదేళ్లపాటు వైద్య విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం మంగళగిరి, మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలల్లో సివి ల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేశారు. పదోన్నతిపై సివిల్ సర్జన్‌గా తెనాలిలోని ఏరియా హాస్పటల్‌కు బదిలీపై వచ్చారు. అక్కడ్నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో అడిషనల్ డైరెక్టర్‌గా 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశారు. తెనాలిలో 18 ఏళ్లపాటు పనిచేసిన డాక్టర్ సుబ్రహ్మణ్యం నిస్వార్థంగా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ అవినీతికి, అక్రమ సంపాదనకేసి చూడకుండా పేదల డాక్టరుగా గుర్తింపును పొందారు. ఆరోజుల్లో హైడ్రోసిల్, హెర్ని యా, గడ్డల శస్త్రచికిత్సలకు రోగులు ఆయన కోసమే ఎదురుచేసేవారు. ఆ శస్త్రచికిత్సల్లో తెనాలి ఏరియా ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉండేదంటే ఆయన సామర్థ్యమే. శస్త్రచికిత్స చేయించుకుని నయమైనవారు, ఆయనకు తిరిగి కనిపించి దండం పెట్టి వెళ్లేవారు. తెనాలిలోని నాటి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆయన శస్త్రచికిత్స సేవలను వినియోగించుకునేవారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం కుటుంబమంతా వైద్యులే. కుమారుడు డాక్టర్ కోటేశ్వరప్రసాద్, కోడలు డాక్టర్ సుధారాణి కుమార్తెలు మాధవీలత, తనూజ లక్ష్మి, అల్లుళ్లు మురళీకృష్ణ, గోవర్ధనరావు అందరూ వైద్యవృత్తిలోనే ఉన్నారు. ఆయన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ది పద్మశాలి వెల్‌ఫేర్ సొసైటీ, తెనాలి గతేడాది ‘వైద్యసేవారత్న’ అవార్డుతో గౌరవించింది. సహస్ర పూర్ణచంద్ర దర్శ నం పూర్తిచేసుకున్న సందర్భంగా కవిరాజ పార్కులోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతేడాది అక్టోబరు 1న ప్రపంచ వయోవృద్ధుల దినో త్సవం రోజున డాక్టర్‌ను సత్కరించింది.


