బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

గుంటూరు లీగల్‌: బాలల సంరక్షణ అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు అది సమాజం, ప్రభుత్వం, ప్రతి పౌరుడి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో శుక్రవారం ప్రపంచ బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. జియాఉద్దీన్‌ మాట్లాడుతూ బాలల దినోత్సవాన్ని కేవలం ఒక వేడుకగా జరుపుకోవడం కాదని, బాలల హక్కులు, వారి భద్రత, సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధి పట్ల మన బాధ్యతలను గుర్తుచేసుకుని వాటి పరిరక్షణకు మనమందరం సమష్టిగా కృషి చేయాలని అన్నారు. బాల్యంలోనే పిల్లల వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, నైతిక విలువలు భవిష్యత్తుకు సంబంధించిన పునాదులు ఏర్పడతాయని అన్నారు. మన భారత రాజ్యాంగం బాలల హక్కులకు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వారికి చట్టం ద్వారా రక్షణ కల్పించాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు సరైన విద్య, చదువు అందుతుందని తెలిపారు. పిల్లలకు ఉన్న లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం చీఫ్‌ సురేష్‌బాబు, డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్‌న్స్‌ కౌన్సిల్‌ మధుబాబు బాలలకు ఉన్న హక్కులపై చట్టాలపై భవిష్యత్తుకు తెసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో అన్ని స్టేక్‌ హోల్డర్‌ సంస్థల వారు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పారా లీగల్‌ వలంటీర్స్‌, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

సయ్యద్‌ జియావుద్దీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement