జిల్లాలో 67.52 శాతం పోలింగ్‌ నమోదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 67.52 శాతం పోలింగ్‌ నమోదు

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

బాపట్ల: జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ గురువారం కొనసాగింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 1,092 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 4,23,735 మంది పురుషులు, 4,44,171 మంది మహిళలు, ఇతరులు 49 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,84,931 మంది పురుషులు, 2,98,704 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 5,83,635 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల ఓటింగ్‌ సరళి ఉదయం చిన్నగా మొదలై మధ్యాహ్నానికి 50 శాతానికి చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 67.52 శాతంగా నమోదైంది. ఐదు గంటల వరకు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్నవారికి సిప్పులు ఇచ్చి 7.30 గంటల వరకు కొన్నిచోట్ల పోలింగ్‌ నిర్వహించారు.

బూత్‌ల పరిశీలన

వేటపాలెం: పరిషత్‌ పోరులో భాగంగా గురువారం వేటపాలెం మండల ప్రధాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరు, పోలింగ్‌ శాతాన్ని పరిశీలించారు. మౌలికవసతులను పోలింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ మండలంలోని దేశాయిపేట, పాపాయిపాలెం, కొత్తపేట పంచాయితీలలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల సందర్భంగా తీసుకున్న భద్రత, పోలింగ్‌ తీరును ఆయన పరిశీలించారు.

మండలం మొత్తం పోలైన శాతం

ఓట్లు ఓట్లు

అమర్తలూరు 37,351 26,219 70.20

బాపట్ల 43,569 30,489 69.98

భట్టిప్రోలు 42,122 28,533 67.74

చెరుకుపల్లి 49,164 34,841 70.87

చినగంజాం 33,679 18,376 54.56

చీరాల 70,767 46,906 66.28

ఇంకొల్లు 40,566 25,994 64.08

కారంచేడు 32,595 21,446 65.80

కర్లపాలెం 41,664 30,206 72.50

కొల్లూరు 45,173 32,189 71.26

మార్టూరు 58,960 40,206 68.19

నగరం 42,477 30,297 71.33

నిజాంపట్నం 50,397 31,840 63.18

పర్చూరు 42,185 28,466 67.48

పీవీపాలెం 27,264 19,005 69.71

రేపల్లె 48,848 32,818 67.18

టి.చుండూరు 37,787 27,453 72.65

వేమూరు 34,862 25,647 73.57

వేటపాలెం 63,125 36,956 58.54

యద్దనపూడి 21,872 15,748 72.00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement