రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

చేబ్రోలు: ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురవటంతో ఇరువురికి గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలో గురువారం జరిగింది. మండల పరిధిలోని వడ్లమూడి గ్రామానికి చెందిన భూపతి, మురళిలు ద్విచక్ర వాహనంపై చేబ్రోలు వైపు వస్తున్నారు. వడ్లమూడి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన ఇరువురిని 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement