రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన పులిచింతల సమాచారం పశ్చిమ డెల్టాకు నీటి విడుదల సాగర్‌ నీటిమట్టం కార్తికేయుని ఆలయంలో భక్తజన సందోహం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్ల శాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ డీసీ మాట్లాడుతూ సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ. 6 లక్షల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కళాకారులకు ఆహ్వానం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా మహోత్సవాలలో సాంస్కృతిక కళా ప్రదర్శనలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. దరఖాస్తులను సోమవారం నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు స్వీకరిస్తారన్నారు. ఒక్కో బృందానికి గరిష్టంగా ఆరుగురు కళాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తామని, దేవస్థాన వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక, భక్తి సంగీత, నృత్య కళాప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి దర్శనానికి ఆరుగురు కళాకారులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు లలిత కళలలో డిప్లొమా, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో పాటు కళారంగంలో అనుభవం, గత ప్రదర్శన పేపర్‌ క్లిప్పింగ్స్‌, ఫొటోలను జత చేయాలని సూచించారు. అదే విధంగా ప్రధాన కళాకారుడి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ఖాతా పాస్‌బుక్‌ మొదటి పేజీ కాపీలను జత చేయాలన్నారు.

న్యూస్‌రీల్‌

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో నియంతృత్వ పోకడలు తీరు మారకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు అవినీతికి మారుపేరుగా టీడీపీ పాలన ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్ట్‌లా? రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని

కమీషన్ల కోసమే పనులు

బాపట్ల
సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.4747 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు ఆదివారం 5,527 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం ఆదివారం 535.70 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 30,955 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

మాట్లాడుతున్న పేర్ని నాని, పక్కన నాగమోహన్‌కృష్ణ.. వేదికపై మేరుగ నాగార్జున, నాయకులు

సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

రేపల్లె: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలన సాగుతోందని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు పేర్ని నాని ధ్వజమెత్తారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించే వారి గొంతులను నొక్కడం చంద్రబాబు బృందానికి అలవాటుగా మారిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని శ్రీగుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, బడుగు, బలహీన వర్గాలపై అణచివేత ధోరణి పెరిగిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం కంటే రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారి గొంతులను నొక్కిపెడుతూ వారిపై కేసులు నమోదు చేయడం, అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పథకాలకు లేని నిధులు వారికెలా వస్తాయి?

రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందని టీడీపీ ప్రభుత్వం చెబుతోందని పేర్ని నాని విమర్శించారు. వైఎస్సార్‌ సీపీపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసే వారికి రూ.15 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ (చిన్న ప్రసాద్‌) సోదరుడు అనగాని శివప్రసాద్‌ (పెద్ద ప్రసాద్‌) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పార్టీ ఫండ్‌ కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవడంతో తల్లిదండ్రులపై ఫీజుల భారం పెరుగుతోందని అన్నారు. ఆక్వా రంగంలోనూ రొయ్యల మేత కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పెంచుతున్నాయని ఆరోపించారు. రొయ్యలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నయవంచకుడు చంద్రబాబు

రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున మాట్లాడుతూ... నమ్ముకున్న వారిని నట్టేట ముంచటం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని విమర్శించారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సాగునీరు సకాలంలో అందక సాగుభూములు బీడుగా మారిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు బృందానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జునలను ఘనంగా సత్కరించారు. పట్టణ, మండల కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్‌, యార్లగడ్డ వెంకట రాంబాబు, దుండి వెంకట రామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్‌మోహన్‌, సంయుక్త కార్యదర్శి చిమటా బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకట కృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నిజాంపట్నం కోటేశ్వరరావు, నాయకులు లుక్కా బాపనయ్య, బొర్రా శ్రీనివాసరావు, కాటూరి శివనాగబాబు, పట్టెం శ్రీనివాసరావు, వీసం నాగలక్ష్మి, నిజాంపట్నం అనంతలక్ష్మి, సజ్జా పద్మావతి, కొప్పుల గోపి, బెల్లంకొండ చిట్టిబాబు, కొక్కిలిగడ్డ రవి, సముద్రాల ప్రభుకిరణ్‌, నీలా వీరేంద్రనాథ్‌, ఉయ్యూరు సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, పట్టణ, మండలంలోని వివిధ గ్రామాల ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ మాట్లాడుతూ.... రూ. కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెబుతున్న సత్యప్రసాద్‌ కమీషన్‌ల కోసమే నిధులు మంజూరు చేయించుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.451 కోట్లతో నిజాంపట్నం హార్బర్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. మిగిలిన కొద్దిపాటి పనులను రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. ఎస్సీ, బీసీలను అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement