విజయవంతంగా ఆపరేషన్‌ త్రిశూల్‌ | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా ఆపరేషన్‌ త్రిశూల్‌

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

చినగంజాం: డ్రగ్స్‌, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను సమూలంగా అరికట్టడానికి ఆపరేషన్‌ త్రిశూల్‌ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. వార్షిక తనిఖీలో బాగంగా చినగంజాం పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం సందర్శించారు. స్టేషన్‌ పరిసరాలు, రిసెప్షన్‌, రైటర్‌ రూమ్‌, స్టోర్‌ రూమ్‌, కంప్యూటర్‌ విభాగం, లాకప్‌ రూమ్‌లతోపాటు వివిధ నేరాల్లో సీజ్‌ చేసిన వాహనాలను క్షణ్ణంగా పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను సక్రమంగా భద్రపరచాలని ఆదేశించారు. రౌడీ షీటర్‌లు, సస్పెక్ట్‌ షీట్‌లను పరిశీలించి పాత నేరాల వివరాలు, వారి ప్రస్తుత జీవన విధానం గురించి ఆరా తీయాలన్నారు. రౌడీ షీటర్‌లు, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని ఆదేశించారు. కంప్యూటర్‌ సీసీటీఎన్‌ఎస్‌ అప్లికేషన్‌ను ఓపెన్‌ చేయించి కేసుల నమోదు విధానాన్ని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని స్వయంగా పరిశీలించారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా నాయకత్వంలో బాపట్ల జిల్లాలో ఆపరేషన్‌ త్రిశూల్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలన, మహిళలపై దాడుల నివారణ, రహదారి భద్రత లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించమన్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు జాతీయ రహదారులున్నాయని.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్‌ ధరించక పోవడం వల్ల జరిగే ప్రమాదాలు, వాటి కారణంగా కుటుంబాలకు కలిగే నష్టాల గురించి స్టేషన్‌ల వారీగా పోలీస్‌ అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు, వాటివల్ల సంభవించే మరణాలు దాదాపుగా 22 శాతం తగ్గాయని అన్నారు. డీఎస్పీ ఎండీ మోయిన్‌, ఇంకొల్లు సీఐ ఎం రామానాయక్‌, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, చినగంజాం ఎస్‌ఐ ఎస్‌.రమేష్‌, ఇంకొల్లు ఎస్‌ఐ జి.సురేష్‌, చినగంజాం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement