నేటి నుంచి డాక్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డాక్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్‌

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

నేటి నుంచి డాక్టర్స్‌ బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తైక్వాండోలో జిల్లాకు పతకాలు కర్లపాలెం ఖ్యాతిని చాటడం అభినందనీయం మహిళల్లో వ్యాధులకు ఆధునిక చికిత్సలపై సదస్సు

గుంటూరువెస్ట్‌ (క్రీడలు): డాక్టర్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 5.0 పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్‌ నిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ సందీప్‌ వేళ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి వచ్చే నెల 4 వరకు ఈ పోటీలు స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. సుమారు 100 మంది వైద్యులు లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతారన్నారు. శనివారం సెమీస్‌, ఆదివారం ఫైనల్స్‌ జరుగుతాయన్నారు. పోటీలను ఎన్టీర్‌ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, డాక్టర్‌ కె.కృష్ణ ప్రసాద్‌ ప్రారంభిస్తారన్నారు.

తెనాలి: గుంటూరులో తైక్వాండో, కరాటే 2026 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టోర్నమెంట్స్‌ ఆదివారం తైక్వాండో 5వ డాన్‌ బ్లాక్‌ బెల్ట్‌ మాస్టర్‌ ఎస్‌.కరుణాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి విద్యార్థులు పాల్గొని గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ అత్యధికంగా సాధించారు. ఈ టోర్నమెంటులో వీఆర్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరావు, పెరల్స్‌ అయ్యర్‌ స్కూల్‌ డైరెక్టర్‌ బాబురావు, టోర్నమెంట్స్‌ను ఆర్గనైజర్‌ ఎస్‌.కరుణాకర్‌ మాస్టర్లు నజీర్‌ బాషా, రాంబాబు, మాలిక్‌, తెనాలి చిన్న మాస్టర్‌, మాస్టర్‌ డాక్టర్‌ పులివర్తి సోమయ్య, మాలిక్‌, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, నరేందర్‌రెడ్డి, సాయిరాం మాస్టర్‌ పాల్గొన్నారు. అనంతరం వివిధ స్థాయిల్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్స్‌ అందజేశారు. అనంతరం కరాటే మాస్టారు రాంబాబు, తెనాలి చిన్న మాస్టర్‌, డాక్టర్‌ పులివర్తి సోమయ్య, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావును ఆర్గనైజర్‌ టైక్వాండో 5వ డాన్‌ బ్లాక్‌ బెల్ట్‌ ఎస్‌.కరుణాకరన్‌ సత్కరించారు.

కర్లపాలెం(బాపట్లటౌన్‌): సామాన్యులకు అందుబాటులో ఉండే సోలార్‌ రీచార్జ్‌ బ్యాటరీల తయారీ విధానంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన గరిగంటి సుధాకర్‌ అభినందనీయులని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. గరిగంటి చేసిన పరిశోధనలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సుధాకర్‌ను రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించిందన్నారు. రాష్ట్రపతి పురస్కారం అందుకున్న సందర్భంగా ఆదివారం కర్లపాలెంలో సుధాకర్‌ స్వగృహంలో ఆయనను సత్కరించారు. నేటియువతరం సుధాకర్‌ను ఆదర్శంగా తీసుకొని నూతన పరిశోధనల్లో ముందుకు సాగాలన్నారు. సుధాకర్‌ను అభినందించిన వారిలో కర్లపాలెం రెడ్‌క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ మందపాటి పరమానంద కుమార్‌, రాణి, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు)/తాడేపల్లిరూరల్‌: మహిళలకు సోకే వ్యాధులకు సంబంధించి అత్యాధునిక చికిత్సలు, సర్జరీలపై విజయవాడలో ఆదివారం సదస్సు నిర్వహించారు. విజయవాడ అబ్‌సే్ట్రటిక్స్‌ గైనకాలజిస్ట్స్‌ సొసైటీ, మణిపాల్‌ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని హోటల్‌ వివంతలో సదస్సు నిర్వహించారు. బ్రెస్ట్‌ హెల్త్‌, బ్రెస్ట్‌ రోబోటిక్‌ సర్జరీల్లో వచ్చిన ఆధునిక మార్పులు, గైనకాలజికల్‌ అంకాలజీ, గర్భధారణ సమయంలో థ్రాంబోసైటోపీనియా, గైనకాలజికల్‌ క్యాన్సర్ల చికిత్స, ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. మణిపాల్‌ ఆస్పత్రి అంకాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళల్లో వచ్చే క్యాన్సర్లను సకాలంలో గుర్తించి, వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు కలిసి సమన్వయంతో చికిత్స అందించడం చాలా అవసరమన్నారు.

ఈ సదస్సులో ఫీటల్‌ హార్ట్‌ స్కాన్‌ సాధారణంగా లేకపోతే.. తర్వాత ఏం చేయాలి?’ అనే విషయంపై, ప్రత్యేక ప్యానెల్‌ చర్చ జరిగింది. గర్భంలోనే బిడ్డ గుండెకు సంబంధించిన సమస్యలను గుర్తించడం, తల్లిదండ్రులకు సరైన కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవసరమైన చోటకు రిఫర్‌ చేయడం, ప్రసవాన్ని ఎలా ప్లాన్‌ చేయాలి? వంటి అంశాలపై ఈ సెషన్‌లో చర్చించారు. సదస్సులో విజయవాడ ప్రసూతి వైద్యుల సంఘం ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.హిమబిందు, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎన్‌.అనిత, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీదేవి, మణిపాల్‌ ఆస్పత్రి రేడియేషన్‌ అంకాలజిష్ట్‌ డాక్టర్‌ రామకృష్ణ, సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ ధర్మేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement