సైన్సుపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సైన్సుపై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవాలి

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

జేవీవీ జిల్లా అధ్యక్షుడు దబ్బకూటి హరిబాబు

బాపట్ల(కర్లపాలెం) :ప్రతి విద్యార్థి సైన్‌న్స్‌పై ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు దెబ్బకుటి హరిబాబు అన్నారు. కర్లపాలెంలోని శ్రీ భార్గవి హైస్కూలులో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెకుముకి పోటీల బహుమతి ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఉదయం జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు యాజలి భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చెకుముకి జిల్లా స్థాయి సంబరాలను ప్రారంభించారు. సభకు జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్‌ కళాధర్‌ అధ్యక్షత వహించారు. హరిబాబు మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలలో 35 టీములు పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రభుత్వ విభాగంలో ఇంకొల్లు మండలం గంగవరం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించగా ప్రైవేటు విభాగంలో బాపట్ల పట్టణానికి చెందిన లిటిల్‌ ఏంజెల్స్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. ప్రభుత్వ భాగంలో ద్వితీయ స్థానాన్ని పెదపులివారి పాలెం జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ విద్యార్థులు, తృతీయ స్థానాన్ని జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ నిజాంపట్నం విద్యార్థులు గెలుపొందారు. ప్రైవేట్‌ విభాగంలో ద్వితీయ స్థానాన్ని చీరాల పట్టణానికి చెందిన విజ్ఞాన భారతి హైస్కూల్‌ విద్యార్థులు, చెరుకుపల్లిలోని వనజ చంద్ర హైస్కూల్‌ విద్యార్థులు తృతీయ స్థానాన్ని సాధించారు. పోటీలలో పాల్గొన్న మండల స్థాయిలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రశంస పత్రం అందజేశారు. జన విజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో దక్షిణామూర్తి ఆలపించిన పలు సైన్‌న్స్‌ గీతాలు పలువురిని ఆలోచింపజేశాయి. పోటీలలో ప్రభుత్వ ప్రైవేటు విభాగాలలో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి మూడో తేదీ వరకు భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి పోటీలలో వారు పాల్గొంటారని హరిబాబు వివరించారు. జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన శ్రీ భార్గవి హై స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కుర్ర రామారావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వినయ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, కోశాధికారి వెంకటేశ్వరరెడ్డి, శ్రీ భార్గవి విద్యాసంస్థల చైర్మన్‌ పేరాల వెంకట సురేష్‌, ప్రిన్సిపాల్‌ లక్ష్మి, యూటీఎఫ్‌ కర్లపాలెం మండల అధ్యక్షులు వైవీ నారాయణ, జనరల్‌ సెక్రెటరీ బీవీ శ్రీనివాసరావు, గుమ్మ శ్రీనివాసరావు, సూర్య హాస్పిటల్‌ డాక్టర్‌ రవికిరణ్‌, లక్ష్మణ్‌, కుమార్‌, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు వై వేణు, చక్రవర్తి, రామాంజనేయరెడ్డి, సత్యశ్రీ, సునీత ప్రసన్న, లత, దివ్య, లావణ్య సాహితీ, లక్ష్మీప్రసన్న, లక్ష్మీదుర్గ, మస్తాన్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement