ప్రజావేదిక స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ప్రజావేదిక స్థల పరిశీలన

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

రేపల్లె: ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ ్స పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్‌ 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లె విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు రేపల్లె విచ్చేసే నేపథ్యంలో ఏర్పాటు చేయాల్సిన హెలీప్యాడ్‌, ప్రజావేదిక, క్యాడర్‌ సమావేశానికి అవసరమైన స్థలాలను వివిధ శాఖల అధికారులతో ఆదివారం సాయంత్రం కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్డీవో బి.శ్రీదేవి, డిఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సాంబశివరావు, డీఎల్‌డీఓ పద్మావతి, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవిబాబు, వివిధ శాఖల డివిజన్‌, మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement