మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:15 AM

బాపట్ల: బాపట్ల ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌–సర్వీస్‌ లీగల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం అక్బర్‌పేటలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ భవన్‌న్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లీగల్‌ అధ్యక్షుడు డి.కృష్ణప్రసాద్‌ అధ్యక్షత వహించారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సంక్షేమ, సమస్యలు, ప్రమోషన్లు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మాజీ సైనికుల హక్కులను పరిరక్షించేందుకు తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని కృష్ణప్రసాద్‌ సూచించారు. లైఫ్‌ సర్టిఫికెట్‌, ఈహెచ్‌ఎస్‌, కోర్టు తదితర సేవల పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆయా సేవలను ఉచితంగా పొందేందుకు సంఘాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, మాజీ సైనికుల మధ్య ఎదురవుతున్న సమస్యలు, అన్యాయాలపై సభ్యులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మాజీ సైనికులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు మాజీ సైనికులను అసోసియేషన్‌ సభ్యులు సత్కరించారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శాంతియుత, సెక్రటరీ వేణుగోపాల్‌, జాయింట్‌ సెక్రటరీ అబ్దుల్‌ సలాం, ట్రెజరర్‌ చిన్న వీరయ్య, సభ్యులు జెట్టి జోసెఫ్‌, మాణిక్యరావు, కాలేషా, ఆవుల వెంకటేశ్వర్లు, వంశీకృష్ణ, అఖిల్‌ మాజీ సైనికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement