కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఇంటిగ్రేటేడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీ సేవలు ప్రారంభం
చీరాల రూరల్: స్థానిక చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటేడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీ సేవలను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని విజయవాడ నుంచి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య కలిసి నూతనంగా ఆవిష్కరించిన ఐపీహెచ్‌ఎల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఒక్కొక్క విభాగాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ల్యాబ్ సేవలను చీరాలలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆస్పత్రి సూపరింటెండెండ్ డాక్టర్ సుభాషిణి, ఏఎంసీ చైర్మన్ కె. జనార్దన్, వైద్యులు డాక్టర్ పి.శ్రీకాంత్, ఈ. హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


