మూడు రోజుల కిందటే మృతి చెంది ఉండొచ్చని అనుమానం
వేటపాలెం: రావూరిపేట మార్కెట్ సమీపంలోని వినాయక దేవస్థానం పక్కన ఉన్న రొయ్యల మే త దుకాణం వెనుక ఓ వ్యకి మృతదేహం కుళ్లిన స్థితిలో శనివారం అసల్యంగా లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు వేటపాలెం ఆర్టీసీ బస్టాంట్ సమీపంలో నివాసం ఉంటున్న జిడుగు ప్రకాస్ (37)గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి శనివారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వెనుక మృతదేహం కనిపించింది. ము ఖం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కనీసం మూడు రోజుల కితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మద్యానికి బానిసై తరచూ తిరుగుతుండేవాడని స్థానికులు తెలిపారు. అయితే మృతికి కారణా లు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


