సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలబాలికల జట్లు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలబాలికల జట్లు ఎంపిక

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

సాఫ్ట్‌బాల్‌ జూనియర్‌ బాలబాలికల జట్లు ఎంపిక రొంపిచర్ల: రొంపిచర్లలో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జట్ల ఎంపికలు నిర్వహించారు. 120 మంది బాలబాలికలు హాజరయ్యారు. వీరిలో బాలుర నుంచి 25 మందిని, బాలికల నుంచి 25 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 25వ తేదీన క్యాంప్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణలో ప్రతిభ చూపిన వారిని జిల్లా టీంకు ఎంపిక చేశామన్నారు. ఎంపికై న టీం అక్టోబర్‌ 12, 13, 14 తేదీల్లో కడప జిల్లా పుల్లంపేటలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్‌ సెక్రటరీ పి.సామంతరెడ్డి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ ఇట్టే ఏడుకొండలు, పూర్వవిద్యార్థుల సంఘం తరఫున పంబా వెంకట్‌, ఆవుల జనార్దన్‌ యాదవ్‌, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీపీడీఈఏ కార్యవర్గం ఎన్నిక కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిప్లమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ (ఏపీపీడీఈఏ) గుంటూరు, సీఆర్‌డీఏ సర్కిళ్ల 2026–27 సంవత్సరానికి సంబంధించిన జనరల్‌ బాడీ సమావేశం, ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. గుంటూరులోని ఏపీపీడీఈఏ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఏపీసీపీడీసీఎల్‌ కంపెనీ సెక్రటరీ ఎ.గుర్నాథరావు అధ్యక్షత వహించారు. అసోసియేషన్‌ కార్యకలాపాలు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించిన అనంతరం కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఆర్‌డీఏ సర్కిల్‌ అధ్యక్షుడుగా ఎన్‌.నాగమల్లేశ్వరరావు, కార్యదర్శిగా ఎన్‌.చిలకరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పి.సురేంద్ర, కోశాధికారిగా డి.చిన మంగారావు, మహిళా కార్యదర్శిగా వై.శిరీష ... గుంటూరు సర్కిల్‌ అధ్యక్షుడుగా ఎం.ఉదయ్‌కిరణ్‌, కార్యదర్శిగా కేవీ సుబ్బారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.సోమశేఖర్‌, కోశాధికారిగా షేక్‌ అబ్దుల్‌ మొయీజ్‌, మహిళా కార్యదర్శిగా కె.కుసుమ కుమారిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర నాయకులు కేవీ శేషారెడ్డి, సన్యాసిరావు, హుస్సేన్‌ ఖాన్‌, నాగరాజు, కోటేశ్వరారవు, రవిశేఖర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. పది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత 27న శతాధిక వృద్ధులకు సన్మాన వేడుక

పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్‌ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్‌లోని రేషన్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్‌ బియ్యం బస్తాలను సీజ్‌ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్‌లు పాల్గొన్నారు.

15లోపు పేరు నమోదుకు అవకాశం

మధురానగర్‌(విజయవాడ సెంట్రల్‌): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ చల్లా హరికుమార్‌, వైస్‌ చైర్మన్‌ తేజ్‌రాజ్‌ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్‌ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement