బల్కర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బల్కర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ ఐచర్‌ వ్యాన్‌ డ్రైవర్‌ మృతిచెందాడు. ట్రాఫిక్‌ పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా నగరం మండలం వెనిగల్లవారిపాళేనికి చెందిన వి.నాగమల్లీశ్వరరావు (41) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం మినీ ఐచర్‌ వ్యాన్‌లో రొయ్యల లోడుతో చైన్నెకి బయలుదేరాడు. అర్ధరాత్రి నెల్లూరు జాతీయ రహదారిపై మయూరి రెస్టారెంట్‌ సమీపంలోకి రాగానే రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బల్కర్‌ వాహనం ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వకుండా ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి కుడివైపునకు మళ్లింది. నాగమల్లీశ్వరరావు వ్యాన్‌ను అదుపు చేయలేక బల్కర్‌ వాహనం వెనుక భాగాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో వ్యాన్‌ క్యాబిన్‌ పూర్తిగా ధ్వంసంకాగా, తీవ్రగాయాలతో నాగమల్లీశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలాకి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుడికి వరుసకు సోదరుడైన సుధీర్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు ఆదివారం నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అబ్దుల్‌ రహీమ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement