లలిత పీవీఎస్‌లో వైద్య విద్యకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

లలిత పీవీఎస్‌లో వైద్య విద్యకు ప్రాధాన్యం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

చైర్మన్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పీవీ రాఘవ శర్మ పెరిఫెరల్‌ న్యూరోపతిపై లలిత సీఎంఈ ప్రారంభం

గుంటూరు మెడికల్‌: లలిత పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రారంభమైన నాటి నుంచి అకాడమిక్స్‌, వైద్య వృత్తిపరమైన విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని సంస్థ చైర్మన్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పీవీ రాఘవ శర్మ అన్నారు. ఆదివారం గుంటూరు తక్కెళ్లపాడులోని లలిత పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో లలిత సీఎంఈ సిరీస్‌ లో తొలి కార్యక్రమంలో పెరిఫెరల్‌ న్యూరోపతిలో ఆధునిక పరిణామాలు అనే అంశంపై సైంటిఫిక్‌ సీఎంఈ నిర్వహించారు. లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆడిటోరియంలో ప్రారంభించారు. ముంబై బాంబే హాస్పిటల్‌కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఖాదిల్కర్‌ గౌరవ అతిథిగా , లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్‌ రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు పీజీ వైద్య విద్యార్థుల కోసం లలిత పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌లో క్రమం తప్పకుండా అకాడమిక్‌ సెషన్లు, క్లినికల్‌ మీటింగ్స్‌, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, న్యూరో సైన్సెస్‌ విభాగాధిపతి డాక్టర్‌ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పెరిఫెరల్‌ న్యూరోపతి వ్యాధుల ప్రాబల్యం నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. వ్యాధులను ఏవిధంగా గుర్తించి చికిత్స అందించే విషయాలను వివరించారు. సంస్థ డైరెక్టర్‌, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పోలవరపు నరేన్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాంబే హాస్పిటల్‌ కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఖాదిల్కర్‌ ‘ఎమర్జింగ్‌ ల్యాండ్‌ స్కేప్‌ ఆఫ్‌ ఇమ్యూనో– మీడియేటెడ్‌ న్యూరోపతిస్‌’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆర్‌ మురళీధర్‌ రెడ్డి ‘రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ డయాబెటిక్‌ న్యూరోపతిస్‌ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్‌ నిమ్స్‌కు చెందిన డాక్టర్‌ వై.శిరీష ప్రాక్టికల్‌ అప్రోచ్‌ టు పెరిఫెరల్‌ న్యూరోపతి అనే అంశంపై ప్రసంగించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ మధు నాగప్ప ఇన్ఫెక్షయస్‌ న్యూరోపతిస్‌ అనే అంశంపై మాట్లాడారు. ముంబైకి చెందిన డాక్టర్‌ విన్నీ విల్సన్‌ ఆధ్వర్యంలో పెరిఫెరల్‌ న్యూరోపతి పై క్విజ్‌ నిర్వహించారు. సీఎం ఈ కార్యక్రమానికి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డాక్టర్‌ తారక్‌నాథ్‌, డాక్టర్‌ యు.వీరమ్మ, డాక్టర్‌ బి.సాయికృష్ణ, డాక్టర్‌ గాజుల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన వైద్యులు, న్యూరాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు, వివిధ మెడికల్‌ కాలేజీలు టీచింగ్‌ హాస్పిటల్‌కి చెందిన పి.జి వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement