బాపట్ల: బాపట్ల ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో బీకాం 1973–76 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం బాపట్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ విరామం అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. అనంతరం అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్నేహితులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులు వీవీ సుబ్బారావు, పీఎం రాజు, జి. శాంతారావు, పి.సాంబశివరావు, ఏ.మధుసూదన్‌రావు, శ్రీనివాసరావు, డబ్ల్యూజీకే మూర్తి, బీసీ సాయిబాబు, జీవీ సుబ్రహ్మణ్యం తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. కార్యక్రమానికి బందా బాబు అధ్యక్షత వహించగా, పూర్వ విద్యార్థులు గోపాలం శ్రీహరి, నూరుభాష ప్రసాద్, ఎం.రాఘవరావు, భుజేగేంద్ర మౌళి, గోపాలరావు, లక్ష్మణ్‌రెడ్డి, డి. పుండరీకాక్షయ్య, వి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.


