తుళ్లూరు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తుళ్లూరు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ప్రమాదం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

లారీ కింద పడి వ్యక్తి మృతి, భార్యకు తప్పిన ప్రమాదం ఘటనతో లారీలను అడ్డుకున్న స్థానికులు, నిలిచిన ట్రాఫిక్‌

తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్‌, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement