బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 రైతుల కష్టాలపై సర్కారు నిర్లక్ష్యం విష్ణు సహస్రనామ పారాయణం

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
రైతుల కష్టాలపై సర్కారు నిర్లక్ష్యం

నగరంపాలెం: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ వెంకటేశ్వర ఆలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు కళావైభవం ఉత్సవాల్లో భాగంగా శనివారం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.

రేపల్లె: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత సిగ్గుచేటు అని వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ చేపట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా పాదయాత్ర ముగింపు సందర్భంగా చెరుకుపల్లి మండలం తుమ్మలపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో నాగార్జున పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రంలోని రైతులకు కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కష్టసుఖాలను పట్టించుకోకుండా పాలన సాగించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో జీవించారని గుర్తుచేశారు. ఆ కాలంలో రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేసి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు.

సాగునీటికి దిక్కేది?

ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాలువల ద్వారా నీటి సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేరుగ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులు అప్పుల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి వసతి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు పార్టీ కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ సమన్వయకర్త నాగమోహన్‌కృష్ణ దీక్షతో ప్రారంభించిన రైతు భరోసా పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయం అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా రైతుల బాధలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగించడం, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. డెల్టా ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం తుమ్మలపాలెంలో ఉన్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్‌, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ బొర్రా వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

మేరుగ నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement