విద్యార్థులను ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఉపాధ్యాయులే తీర్చిదిద్దాలి

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

హియరింగ్‌ పెండింగ్‌ లేకుండా చూడాలి

బాపట్ల టౌన్‌: విద్యార్థులను అన్నివిధాలుగా తీర్చిదిద్ది సమాజానికి అందించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ తెలిపారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని సాయి గార్డెన్స్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్‌ కలిసి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఐఏఎస్‌కు ఎంపికై న తర్వాత మొదటిసారిగా తనకు శిక్షణ ఇచ్చిన ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి తాను ఫోన్‌ ద్వారానే శనివారం శుభాకాంక్షలు తెలిపానన్నారు. తాను ఇంజినీరింగ్‌ చదవాలనుకున్నా.. బయాలజీలో 98 మార్కులు రావడంతో సదరు ఉపాధ్యాయురాలు అనూరాధ, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు సురేఖ ప్రోత్సహించడంతో డాక్టర్‌ అయ్యానన్నారు. మెడిసిన్‌లో కర్ణాటక రాష్ట్రంలోనే 53వ ర్యాంకు సాధించానని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ సమాజంలో మంచి వ్యవస్థను రూపుదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకే సాధ్యమన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సేవలు మరువలేనివన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 60 మందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌ సింగ్‌, ఆర్డీవో హరికుమార్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చివుకుల దుర్గాప్రసాద్‌, సగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌

బాపట్ల: ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఏఈఆర్‌ఓ వద్ద హియరింగ్‌ పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సర్‌ నిర్వహణపై శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బీఎల్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... జాబితా ముసాయిదా తయారీ, నాణ్యత గల ఫొటోలను అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మండలాలవారీగా పెండింగ్‌ ముసాయిదా జాబితా తయారీ వివరాలను సంబంధిత అధికారులకు చూపించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫారం 6, 7, 8 పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. 6న ఆదివారం ప్రత్యేక క్యాంపెయిన్‌ జరుగుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లవన్న, జిల్లా పంచాయతీ అధికారి ఎల్‌. ప్రభాకర్‌రావు, ఎన్నికల విభాగ పర్యవేక్షకుడు షఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement