సీఎం చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు | - | Sakshi
Sakshi News home page

సీఎం చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

సీఎం చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు

చీరాల: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కె.మధుసూదనరావు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డును అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆయన రాష్ట్ర అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.స్నేహలత, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆయనను ప్రత్యేక అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

అందుకున్న సాల్మన్‌..

గురుపూజోత్సవం ప్రభుత్వం అందించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును చీరాల ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు బి.సాల్మన్‌ అందుకున్నారు. శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించిన ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడంపై ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement