బాపట్లటౌన్: ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు ఆగవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు తెలిపరు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ శనివారం కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి బాపట్ల ఏరియా వైద్యశాల ప్రాంగణంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సత్యంరాజు మాట్లాడుతూ రెగ్యులర్ అయ్యేంతవరకు 100 శాతం గ్రాస్ జీతాన్ని అందజేయాలన్నారు. ఎక్కడా రోగులకు ఇసుమంతైనా అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను నిరాటంకంగా నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్నారు. స్టాఫ్‌నర్స్‌లు తబిత, కల్పన, ఫార్మసిస్టులు సుధా పరిమళ, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, కంచర్ల రత్నకుమార్(నిజాంపట్నం ), సునీత, కిరణ్(చినమ్మట్లపూడి )రేడియోగ్రాఫర్ వెంకటలక్ష్మి (నిజాం పట్నం) పాల్గొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ
సభ్యుడు కూరపాటి


