బాపట్ల: బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆంధ్రప్రదేశ్ దేశీయవైద్య సంఘానికి ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేశారని ఆంధ్రప్రదేశ్ జీవవైవిద్య మండలి మెంబర్ సెక్రటరీ పి.రామకృష్ణ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ జీవవైవిద్య మండలి ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1326 గ్రామ పంచాయతీల్లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దేశీయ వైద్య సంఘానికి ఈ బాధ్యత అప్పగించినట్లుగా సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. పీఎంసీ కమిటీల ద్వారా సాంప్రదాయ వైద్యులకు అధికారిక గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ వైద్యులు ఈ కమిటీల్లో చేరాలని, దేశీయ సంఘం వారి తరఫున అప్లికేషన్లు సిద్ధం చేసి పంపడం జరుగుతుందని, సాంప్రదాయ వైద్యాన్ని కాపాడటమే ఏపీ దేశీ వైద్య సంఘం లక్ష్యమన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి నామాల శ్రీనివాసరావు జీవవైవిద్యాన్ని కాపాడుదామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కార్యదర్శి వీఎల్‌పీ కుమార్ పాల్గొన్నారు.


