బాపట్ల టౌన్: న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే తీసుకురావాలని బాపట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విన్నకోట సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం న్యాయవాదులు బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా విన్నకోట సత్యప్రసాద్ మాట్లాడుతూ.. న్యాయవాదుల వృత్తి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నుంచి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి బాపట్ల న్యాయవాదులు కూడా మద్దతుగా ఉద్యమాలు నిర్వహిస్తారని తెలిపారు. రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించి, బాపట్ల కోర్టు సముదాయం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ టి. రామకృష్ణ, ట్రెజరర్ నాగమోహిని, లైబ్రరీ సెక్రటరీ కారుమూరి సురేంద్రనాథ్, న్యాయవాదులు ప్రవీణ్ కుమార్, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనకు దిగిన న్యాయవాదులు


