రాజముద్ర | - | Sakshi
Sakshi News home page

రాజముద్ర

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

రాజముద్ర రాజన్నా.. నిను మరువలేమన్నా ‘చింత’లు తీర్చిన రాజన్న

జిల్లా నుంచే ఆరోగ్యశ్రీ ప్రారంభం

అభివృద్ధిపై
రాజన్నా.. నిను మరువలేమన్నా

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజకీయ ఖిల్లా గుంటూరు జిల్లాపై దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. గుంటూరు జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆపార్టీకి అడ్రస్సే గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్‌ కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో పర్యటించి 18 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందేలా చేశారు. ప్రభుత్వ కూర్పులోనూ జిల్లాకు పెద్ద పీట వేసి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి జిల్లాను మినీ కేబినెట్‌గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. అయితే దురదృష్ట పరిణామాల నేపథ్యంలో ఆయన మరణించడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. రాజకీయ నాయకుల సంగతి పక్కనపెడితే ప్రజలు మాత్రం మహానేతను గుండెల్లో గూడుకట్టుకుని దైవంగా ఆరాధిస్తున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో గుండెలు ఆగిపోయాయి. బుధవారం దివంగత వైఎస్సార్‌ వర్ధంతి నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా కార్యక్రమాలు నిర్దహించేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు.

అనేక పథకాలకు జిల్లా నుంచే శ్రీకారం

ముఖ్యమంత్రి హోదాలో దివంత మహానేత వైఎస్సార్‌ ఉమ్మడి జిల్లాలో 57 సార్లు పర్యటించడం విశేషం. వివిధ గొప్ప పథకాలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. రాజీవ్‌ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. ఏడాదికి సగటున పది సార్లు మహానేత జిల్లాలో పర్యటించారు. ఇందిరప్రభ, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా నుంచే ప్రారంభించారు. జిల్లాలో వందలాది మంది కార్యకర్తలను నేతలుగా తీర్చిదిద్దిన ఘనత దివంగత మహానేతదే. దాదాపుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు, అనుచరులు ఉన్న ఏకై క నేతగా, నిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నేతగా, జిల్లా ప్రజల మదిలో ఆ మహానేత ఎప్పటికీ చిరస్మరణీయుడు.

నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రారంభించడం ఆనందించదగ్గ విషయం. గుంటూరు నగరంలోని సాయిభాస్కర్‌ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సేవలను మొట్టమొదటగా ప్రారంభించి అప్రతిహతంగా కొనసాగించారు. అలాగే జిల్లాలో ప్రారంభమైన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షల పై చిలుకు ఆపరేషన్లు జరుగ్గా ఇప్పుడు ఎన్‌టీఆర్‌ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందక నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జిల్లాకు రాజకీయ ఉన్నతి

కల్పించిన మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌

రాజన్న మరణంతో జిల్లాలో

ఆగిన గుండెలెన్నో

అనేక రాష్ట్రస్థాయి పథకాలకు

జిల్లా నుంచే శ్రీకారం

పులిచింతల ప్రాజెక్ట్‌ వైఎస్సార్‌ పుణ్యమే

జిల్లా నుంచే ఆరోగ్యశ్రీ పథకం

ప్రారంభం

జిల్లాతో దివంగత మహానేతకు

విడదీయరాని అనుబంధం

మహానేత వర్ధంతికి భారీ

ఏర్పాట్లు చేసిన అభిమానులు

జిల్లా ప్రజలకు చిరకాల స్వప్నంగా నిలిచిన పులిచింతల ప్రాజెక్టును సాకారం చేసింది మహానేత వైఎస్సారే. అనేక అడ్డంకులు, అవరోధాలు దాటుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004 అక్టోబరు 15న రూ. 682 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తనదనంతరం పర్యావరణ అనుమతులు లేక ప్రాజెక్టు నిలిచిపోతే ప్రత్యేకదృష్టి నిలిపి, పర్యావరణ అనుమతులు సాధించి 2005 జూన్‌లో పనులను ప్రారంభించి ప్రతినెలా అభివృద్ధిపై సమీక్షించారు. ఆయన మరణంతో పులిచింతల పనులు నత్తనడకన ఏళ్ల తరబడి కొనసాగాయి. అందుకే పులిచింతల పేరు వినగానే జిల్లా వాసులకు మహానేతే గుర్తుకువస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement