ఓటుకు వేటు! | - | Sakshi
Sakshi News home page

ఓటుకు వేటు!

Sep 2 2026 2:46 AM | Updated on Sep 2 2026 2:46 AM

మాజీ సర్పంచి

ఓటుకూ ఎసరు

పొన్నూరు: పొన్నూరు నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భయం వెంటాడుతోంది. పొన్నూరులో రెండేళ్ల పాలనలో టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో టీడీపీపై అసంతృప్తి భారీగా పెరిగిపోగా.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమాన్ని చూసిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ పాలనను కోరుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

‘సర్‌’ను అనుకూలంగా మార్చుకుని..

నియోజకవర్గంలో పట్టుకోసం గ్రామాలు, పొన్నూరు పట్టణంలో వైఎస్సార్‌ సీపీకి చెందినవారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపధ్యంలో సర్‌ ప్రక్రియను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కారణాలతో ఫిర్యాదులు చేస్తూ వైఎస్సార్‌ సీపీ ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలంగా లేని ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

పలు కారణాలతో నోటీసులు తీసుకున్న వారు తమ ఓటును నిలబెట్టుకునేందుకు అన్ని పత్రాలను సమర్పించినా అధికారుల లాగిన్‌లో నుంచి ముందుకు కదలడం లేదు. తమకు జరుగుతున్న అన్యాయంపై గుంటూరు కలెక్టరేట్లో జరిగే పీజీఆర్‌ఎస్‌లో ఓటర్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నాయకుల ప్రమేయంతో ఓటును రిజెక్టు చేస్తే ఓటర్లకు సమాధానం చెప్పుకోవాల్సి రావడం.. ఓటు ఉంచితే అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. అధికారులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సర్‌ ప్రక్రియకు సమయం తక్కువగా ఉన్న నేపధ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమస్యాత్మక గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి తమ ఓటు హక్కును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

పొన్నూరు నియోజకవర్గంలో

టీడీపీ నీఛ రాజకీయాలు

వైఎస్సార్‌ సీపీ ఓట్ల తొలగింపే

లక్ష్యంగా కుట్రలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement