తాడికొండ: భారత్–డెన్మార్క్ ఇంధన భాగస్వామ్య (ఐఎన్‌డీఈపీ) అమలులో భాగంగా రాజధానిలో మంగళవారం డెన్మార్క్ బృందం పర్యటించింది. రాజధానిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టంగా అభివృద్ధి చేసే అంశాలపై ఏపీసీఆర్‌డీఏ అధికారులు, డెన్మార్క్ ప్రతినిధులు చర్చలు జరిపారు. అనంతరం అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి రాయపూడి ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని అమరావతి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఏఐసీసీ)లో డిజిటల్ ట్విన్ ద్వారా అమరావతి అభివృద్ధిని విజువల్ సిమ్యులేషన్ రూపంలో డెన్మార్క్ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో ఏపీసీఆర్‌డీఏ ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాస రావు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగ జాయింట్ డైరెక్టర్ అంజనా జేమ్స్, జనరల్ మేనేజర్ ఎస్.జె.ఎస్.స్టీఫెన్, ఐటీ విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఎల్) ఏ.జెస్సికా రాజేశ్వరి పాల్గొన్నారు.


