ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

Sep 1 2026 1:49 AM | Updated on Sep 1 2026 1:49 AM

బాపట్లటౌన్‌: వైద్యశాఖలో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాలు ఆగవని జిల్లా జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు తెలిపారు. శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన విరామ సమయంలో బాపట్ల ఏరియా వైద్యశాల ఆవరణంలో నేలపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూరపాటి సత్యంరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరగా పరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. నిరసనలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించేంతవరకు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్టాఫ్‌ నర్స్‌ అనూరాధ, ఫార్మాసిస్ట్‌ నళిని, శాంతి మనోజ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ నీలిమా, బయోమెడికల్‌ ఇంజినీర్‌ నళినీకుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement