తాడికొండ: చలపతి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ బీవీ చౌదరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రొఫెసర్ బీవీ చౌదరికి విద్య, పరిశోధన, పరిపాలనా రంగాల్లో 30 ఏళ్లకుపైగా అనుభవం ఉందని, ఆయన ఐఐటీ న్యూఢిల్లీ నుంచి ఎంటెక్, పీహెచ్‌డీ పట్టాలను పొందారన్నారు. వెస్ట్ ఇండీస్‌లో సుమారు 25 సంవత్సరాల పాటు డీన్ ప్రొఫెసర్‌గా సేవలందించారని, నెదర్లాండ్స్, అమెరికా తదితర దేశాలను సందర్శించారని, పరిశోధనా రంగంలో విశేష కృషి చేసి 175 పరిశోధనా పత్రాలను ప్రచురించడంతోపాటు 15 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారన్నారు. ఎస్‌టీసీ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. ప్రొఫెసర్ బీవీ చౌదరి మాట్లాడుతూ చలపతి యూనివర్సిటీని విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన పరిశోధనా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ వై సుజిత్ కుమార్ వీసీకి అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు, డైరెక్టర్ డి వినయ్‌కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ కె కిరణ్‌కుమార్‌లు వైస్ ఛాన్స్‌లర్‌ను అభినందించారు.


