బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Aug 29 2026 1:34 AM | Updated on Aug 29 2026 1:34 AM

శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026 రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, జాతీయ రహదారుల శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్‌స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ప్రజల్లో అవగాహన తదితర అంశాలపై శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని న్యూ వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, నివారణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, సాయంత్రం వేళల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న భద్రతా చర్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవసరమైన చోట్ల బోర్డులు, బారికేడ్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారుల పక్కన చెట్లు, పొదలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్యం అందించడంలో పీఎం రహత్‌ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని సంబంధిత ఆసుపత్రికి తరలించి, క్యాష్‌లెస్‌ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రమాద బాధితులకు అత్యవసర వైద్యం అందించడంలో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖలు, ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి శాఖ బాధ్యతగా భావించి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్‌, చీరాల, బాపట్ల, రేపల్లె డీఎస్పీలు, రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి, నేషనల్‌ హైవే అధికారులు, ఆర్‌ అండ్‌ బీ డీఈ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లో వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా విజిలెన్‌న్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు లేవనెత్తిన సమస్యల పరిష్కారంపై పురోగతిని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సదరు సమస్యలపై అధికారులు తీసుకున్న నిర్ణయాలను వారు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు లేవనెత్తిన పలు సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సుధాకర్‌, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, కమిటీ సభ్యులు, ఇతర జిల్లా అధికారులు, బాపట్ల చీరాల రేపల్లె డీఎస్పీలు, ఎస్సీ, ఎస్టీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీకి సంబంధించి హియరింగ్‌ పెండింగ్‌ లేకుండా పది రోజులలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి సర్‌, సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా తయారీపై ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఈఆర్‌ఓలు, ఏఈ ఆర్‌ఓలు, బీయల్‌ఓలతో కలెక్టరేట్‌ల నుంచి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీపీఓ ఎల్‌.ప్రభాకరరావు, కోఆర్డినేషన్‌ సెక్షన్‌ పర్యవేక్షకుడు షఫి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

22ఏ భూములపై సమీక్ష

బాపట్ల: 22ఏ కేసులు, 1954కు ముందు ఉన్న నిషేధిత జాబితా భూములకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో డీఎల్‌ఎస్‌సీ సమావేశం జరిగింది. సమావేశంలో మొత్తం 13 అంశాలను పరిశీలించారు. 10 అంశాలకు ఆమోదం తెలపగా, 3 అంశాలను తిరస్కరించారు. భూముల రికార్డులు, నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో జేసీ భావన, డీఆర్వో లవన్న, ఏడీ సర్వేయర్‌ శేషగిరి, జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, చీరాల ఆర్డీవో నరసింహారావు, ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సతీష్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

గంజాయి రహితంగా జిల్లాను మార్చాలి

వరలక్ష్మి వ్రతం

శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

బ్లాక్‌స్పాట్లు, ప్రమాదకర

ప్రాంతాలపై దృష్టి పెట్టండి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన

ఎస్సీ,ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి

రోజూ 250 హియరింగ్‌లు పూర్తిచేయాలి

ఏసీబీ దాడి చేసినా అదే తీరు

బాపట్ల జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నార్కోటిక్‌ కోఆర్డినేషన్‌న్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సుధాకర్‌, చీరాల, బాపట్ల, రేపల్లె డీఎస్పీలు మొయిద్దీన్‌న్‌, చంద్రమౌళి, అజీజ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస సింగ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మావతి, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాకుమాను: కొండపాటూరులోని పోలేరమ్మ దేవస్థానంలో శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement