నేడు సాగర్ కుడి కాలువకు నీరు ● సాగుకు వినియోగించకుండా చూడాలి
● అధికారులకు పెట్రోలింగ్ విధులు
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు ● లింగంగుంట్ల ఓ అండ్ ఎం డీఈఈ వి.శ్రీనివాసరావు, డీఈఈ ఉమాశంకర్, సబ్ డివిజన్ డీఈఈ ఎం.బాలకోటేశ్వరరావు, సంతగుడిపాడు డీఈఈ జె.విజయలక్ష్మి, చిలకలూరిపేట డీఈఈ పి.మల్లికార్జునరావు, వారి పరిధిలో పనిచేసే ఏఈఈలకు 10ఆర్ చిలకలూరిపేట మేజరు కాలువ, ఏబీసీ, పెదనందిపాడు బ్రాంచ్ కెనాల్, ఆ పరిధిలోని మేజరు, మైనరు కాలువపై విధులు కేటాయించారు.
● వినుకొండ ఈఈ జె.శ్రీనివాసులును ఇనుమెళ్ల, అంగలూరు, పెరుమాళ్లపల్లి, పెరూరుపాడు, దొండపాడు, చీకటిగలపాలెం మేజర్లు, మైనరు కాలువలపై నిఘా అధికారిగా నియమించారు.
● ఎన్‌ఎస్పీ ఈఈ టి.రమేష్‌ను బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్, జూలకల్లు బ్రాంచ్ కెనాల్, మేజర్లు, మైనర్ కాలువలపై నిఘా అధికారిగా నియమించారు.
● సత్తెనపల్లి ఈఈ ఎం.మురళీధర్‌ను గుంటూరు బ్రాంచ్ కెనాల్, మేజర్లు, మైనరు కాలువలపై నిఘా అధికారిగా నియమించారు.
● లింగంగుంట్ల మానిటరింగ్ డీఈఈ ఆర్.మల్లికార్జునరావు, మాచర్ల సబ్ డివిజన్ డీఈఈ ఐ.గోపాలరావు, నకరికల్లు సబ్ డివిజన్ డీఈఈ లింగమూర్తి, మానిటరింగ్ సబ్ డివిజన్ డీఈఈ షేక్ ఖాదర్‌లను సాగర్ కాలువ జీరో నుంచి 85వ మైలురాయి వరకు, ఓటీలు, రెగ్యులేటర్లపై నిఘా అధికారులుగా నియమించారు. ఆయా అధికారులకు ఆయా ప్రాంతాల పరిధిలోని తహసీల్దార్లు, పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈ, ఏఈలు, పబ్లిక్ హెల్త్ డిపార్డుమెంట్ డీఈఈలు, వారి సిబ్బంది, మున్సిపల్ డీఈఈ, ఏఈలు, వారి సిబ్బంది సహాయకులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
అందరూ అప్రమత్తంగా ఉండాలి జాయింట్ కలెక్టర్ సంజనా సింహ
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువకు బుధవారం ఉదయం 10 గంటలకు రెండు వేల క్యూసెక్కులు విడుదల చేయనున్న నేపథ్యంలో తాగు అవసరాలకే వినియోగించేలా చూసేందుకు పలు విభాగాల అధికారులకు నిఘా విధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం తాగునీటి చెరువులకు మాత్రమే ఆ నీటిని వినియోగించాలని, సాగుకు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించకుండా రైతులను నియంత్రించేందుకు అధికారులు చూడాలని ఆదేశించారు.
నరసరావుపేట: సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేస్తున్నందున పల్నాడు జిల్లాలోని కాలువ పక్కన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంయుక్త కలెక్టర్ సంజనా సింహ మంగళవారం పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, నీటి పారుదల అధికారులతో జేసీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ నుంచి విడుదలయ్యే తాగు నీటితో గ్రామాల్లోని ఎస్‌ఎస్ ట్యాంకులు నింపాలని ఆదేశించారు. ఆ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు వినియోగించరాదని తెలిపారు. అధికారులు, సిబ్బంది నిరంతరం కాలువ వెంబడి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కాలువ పక్కన ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు. పిల్లలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.