గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి 16వ రోజుకు చేరుకుంది. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా కోర్టు స్కిట్‌ను జూడాలు ప్రదర్శించారు. జీజీహెచ్ జూడా సంఘం నేతలు సమ్మె విరమణపై అధికారిక ప్రకటన చేయలేదు. సమ్మెలో గుంటూరు మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యు.ఈశ్వర్‌శంకర్, వైస్ ప్రెసిడెంట్స్ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్ సోహిల్ అలీ, జనరల్ సెక్రటరీలు జగదీష్ గాదె, డాక్టర్ పి.ఎస్.వి.కల్యాణి, విఘ్నేష్ ఆపతి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్, జాయింట్ సెక్రటరీలు బి.వంశీకష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్ కార్తీక్, నిషిరాగ్ బికుంతె, పి.సందీప్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్.సాయిప్రదీప్, ఉదయ్‌సాగర్, సాయిప్రదీప్, తరుణ్‌కుమార్, హేమంత్‌నాయక్ పాల్గొన్నారు.


