గుంటూరు లీగల్: న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఎస్‌వైకే లీగల్ వారియర్ టీం నిలిచింది. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చందు 11 జట్టుపై ఎస్‌వైకే లీగల్ వారియర్స్ జట్టు విజయం సాధించింది. ఆకాష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా, సాజిద్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యారు. ఫైనల్ మ్యాచ్‌ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు టాస్ వేసి ప్రారంభించారు. జట్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ఎ.శాంతకుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అభినందించారు. విజేత, రన్నరప్ జట్లకు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కప్‌లను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


