ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026 పోరంబోకు భూములు హాంఫట్!
వేటపాలెం: చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం నాయినపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో, 216 జాతీయ రహదారి (ఒంగోలు–దిగమర్రు) పక్కనే చల్లారెడ్డిపాలెం గ్రామం వద్ద రహదారికి ఇరువైపులా 111 ఎకరాల ప్రభుత్వ సొన పోరంబోకు భూమి ఉంది. వ్యవసాయానికి అనువుగా ఉండటంతో ఈ భూములపై కొంతమంది కన్నేసి గద్దల్లా వాలిపోయారు. మామూళ్ల మత్తులో మునిగిపోయిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లను ప్రభుత్వానివని నమోదు చేయలేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు భూములుగా చూపించి రిజిస్ట్రేషన్లు జరగడంతో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఒక్కో ఎకరం రూ.2 కోట్లకు పైమాటే పలుకుతోందని సమాచారం.
ఇదీ జరిగింది...
మండలంలోని నాయినపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని చల్లారెడ్డిపాలెం వద్ద బైపాస్ రోడ్డుకు ఆనుకుని సర్వే నంబర్ 59లో 111 ఎకరాల సొన పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిని తరువాత వచ్చిన తహసీల్దార్లు 1 నుంచి 11 వరకు సబ్‌డివిజన్లుగా విభజించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ భూమిలో 1956లో అప్పటి రెవెన్యూ అధికారులు 18 ఎకరాలను ఏ–డబ్ల్యూ కింద కన్వర్షన్ చేసి, కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు ఇచ్చారు. అనంతరం 1993లో మిగిలిన 93 ఎకరాలను విభజించారు. రెవెన్యూ అధికారులు స్వలాభం కోసం పలు విధాలుగా మార్పులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల సబ్‌డివిజన్ సర్వే నంబర్లు, విస్తీర్ణానికి సంబంధించిన రికార్డులను చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి, ఇవి ప్రభుత్వ భూములని తెలియజేయాల్సి ఉంది. కానీ అప్పటి అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆక్రమించిన వారు అవి తమ పూర్వీకులవని పేర్కొంటూ అప్పట్లో గ్రామ సర్వేయర్లు, వీఆర్‌వోల నుంచి ఎన్‌ఓసీలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పూర్తి హక్కులు వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి.
న్యూస్‌రీల్
రీ సర్వేలో వెలుగులోకి వాస్తవాలు
పస్తుతం నాయినపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రీ సర్వే జరిగింది. సర్వే సిబ్బందికి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్ 59లో 111 ఎకరాలు సొన పోరంబోకు భూమిగా నమోదై ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ భూమిలో ఉన్న రైతులు తమ సొంత పట్టా భూమి అని, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను చూపిస్తున్నారు. రీ సర్వేలో ఆ భూమిని సొన పోరంబోకు భూమిగానే నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి అది చెల్లదని పేర్కొంటున్నారు. అప్పట్లో ఉన్న రెవెన్యూ ఉన్నతాధికారులు రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూముల్లో లేఅవుట్లు వేసి సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిన సర్వే నంబర్లతోనే ఈ ప్లాట్లను విక్రయానికి పెట్టినట్లు సమాచారం.
పులిచింతల సమాచారం
ఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పోరంబోకు భూములు హాంఫట్!
దివ్యాంగ చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి
తెనాలి, వేమూరు నియోజకవర్గాల
అఖిలపక్ష నేతల డిమాండ్
రూ. కోట్ల విలువైన ప్రభుత్వ
భూమి కబ్జా
దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు
చల్లారెడ్డిపాలెం రహదారికి
ఇరువైపులా లేఅవుట్లు
చక్రం తిప్పుతున్న అక్రమార్కులు
రెవెన్యూ అధికారులకు
భారీగా ముడుపులు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.99 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు అక్రమార్కులు. రూ. కోట్ల
విలువైన పోరంబోకు భూమిపై వారి కన్నుపడింది. రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చి ప్రసన్నం చేసుకున్నారు. దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి చక్కగా లేఅవుట్ వేసేశారు. ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.