చదవకపోతే కొడతారని పరారీ | - | Sakshi
Sakshi News home page

చదవకపోతే కొడతారని పరారీ

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

చదవకపోతే కొడతారని పరారీ ● స్కూల్‌ నుంచి పారిపోయిన ఇద్దరు బాలురు ● తల్లి వద్దకు క్షేమంగా చేర్చిన పోలీసులు వేటపాలెం: చదవకపోతే కొడతారని ఇద్దరు అన్నదమ్ములు పారిపోగా, క్షేమంగా తల్లి చెంతకు చేర్చినట్లు ఎస్‌ఐ జనార్దన్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాటాడుతూ... వేటపాలెం మండలం దేశాయిపేట పరిధిలోని కేపాల్‌ కాలనీకి చెందిన కోనుట్ల శ్రీవల్లి దంపతులకు కుమారులు గణేష్‌ కుమార్‌ రెడ్డి, గౌరీ శంకర్‌ రామ లక్ష్మారెడ్డి ఉన్నారు. ఆమోదగిరిపట్నం ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో ఐదో తరగతి చదువుతున్నారు. గురువారం స్కూల్‌ నుంచి తిరిగి రాలేదు. తల్లి స్కూల్‌ వద్దకు వెళ్లి వాకబు చేసింది. మధ్యాహ్నం నుంచి వారు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి వెతికించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. వారు జె. పంగులూరు మండలం అలవలపాడు గ్రామంలోని తమ తాతయ్య బక్క రామిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు వారిని తీసుకొచ్చి శుక్రవారం తల్లికి అప్పగించారు. సక్రమంగా చదవడం లేదని ఉపాధ్యాయులు తమ ఇంట్లో చెపితే కొడతారని భయపడి ట్రైన్‌ ఎక్కి వారు వెళ్లినట్లు ఎస్‌ఐ తెలిపారు. వెల్లటూరు గ్రామ దేవతలకు సారె

భట్టిప్రోలు: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ కట్లమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు శుక్రవారం భక్తులు వైభవంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో అమ్మవార్లకు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, పిండివంటలతో కూడిన సారెను అందజేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు క్రోవి రామకృష్ణ మాట్లాడుతూ అమ్మవార్లకు సారె సమర్పించడం మన జీవితాలను అమ్మవారికి శరణాగతి చేసుకోవడమేనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement