చుండూరు (వేమూరు): తుంగభద్ర సైడ్ కాలువ కట్ట కోతకు గురైనప్పటికీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర సైడ్ కాలువకు సాగునీరు విడుదల చేశారు. గతేడాది నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల దుండిపాలెం నుంచి యడ్లపల్లి వంతెన వరకు తుంగభద్ర సైడ్ కాలువ కట్ట కోతకు గురైంది. వేసవి కాలంలో మరమ్మతులు కూడా చేయలేదని రైతులు తెలిపారు. తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కట్టలు బలహీనంగా ఉండటంతో నడిగడ్డవారిపాలెం, చుండూరు గ్రామాల వద్ద నీరు పొర్లి పొలాల్లోకి వెళ్లి పంట దెబ్బతింటోందని తెలిపారు. నడిగడ్డవారిపాలెం వద్ద కాలువకు వంతెన ఏర్పాటు చేశారు. అక్కడ గుర్రపు డెక్క నిలిచిపోవడంతో సాగునీటి పారుదల కష్టంగా మారింది.


