న్యూస్‌రీల్
పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న తమ్ముళ్లు చెరువుల్లో యథేచ్ఛగా మట్టి తరలించి అక్రమార్జన టీడీపీ నేతలతో అధికారులు కూడా కుమ్మక్కు ప్రజాప్రయోజనాల కంటే సంపాదనే ధ్యేయంగా అక్రమాలు
మా దృష్టికి రాలేదు
బాపట్ల
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.
పర్యావరణానికి చేటు చేసేలా పచ్చ నేతలు యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారమే అండగా తమ్ముళ్లు అక్రమార్జనకు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, డ్రైనేజీ అధికారులు అండగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్చూరు (చినగంజాం): టీడీపీ నేతలు స్థానిక చెరువులు, వాగుల్లో మట్టిని తవ్వి యథేచ్ఛగా అమ్మేసుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. భవిష్యత్‌లో చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. నిత్యం లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని భారీ యంత్రాలతో నింపి తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులుతో భయపెట్టడం, రాజకీయ నాయకులు బెదిరింపులకు గురిచేస్తుండటంతో మిగతవారు కూడా మిన్నకుండి పోతున్నారు. ప్రస్తుతం పర్చూరు నియోజక వర్గ పరిధిలో అన్ని మండలాల్లో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన వారంతా కుమ్మకై ్క దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన అందిన కాడికి దోచేసుకుంటున్నారు.
పంటలకు ప్రమాదం
పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో సర్వే నంబర్ 232లోని చెంచుకుంట, సర్వే నంబర్ 111లోని బురఖాయల కుంట ప్రాంతాల్లోని చెరువు మట్టిని లారీలు, ట్రాక్టర్‌లు, జేసీబీల సాయంతో నిత్యం తవ్వేస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ వారి అండదండలతో రూ.కోట్ల విలువైన మట్టిని ఇలా చెరబడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో చెరువులు, వాగులు కట్టలు లేకుండా పోయి చుట్టు పక్కల పంట పొలాలు దెబ్బతినే పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి చేస్తున్నారట!
ప్రకృతిని నిలువునా దోచుకుంటున్న తీరును అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు కేసులకు భయపడి ఎవరూ ధైర్యంగా అడ్డు చెప్పేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వీటిని ఆపాల్సిన రెవెన్యూ, మైనింగ్, డ్రైనేజీ అధికారులు మాత్రం ఎక్కడా మట్టి విక్రయిస్తున్న దాఖలాలు లేవని తేల్చేశారు. వాగు కట్టలు తీసి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి తప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల భారీ గోతులు ఏర్పడటంతో వర్షాకాలంలో నీటితో నిండి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
ఈ విషయమై తహసీల్దార్ పి. బ్రహ్మయ్యను వివరణ అడగగా... నూతలపాడు గ్రామంలోని మట్టి తవ్వకం గురించి తన దృష్టికి రాలేదని చెప్పారు. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనులపై సమాచారం లేదని తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు.


