చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న చెన్నకేశస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగి గురువారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ప్రాంగణంలో ఆంజనేయ, మహావిష్ణు, హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి హోమం పూర్తి చేశారు.కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన బోయిన వెంకన్న బృందంచే నాదస్వర కచేరి నిర్వహించారు. ఖాజీపాలెం గ్రామానికి చెందిన హరిహర భక్త సమాజం వారిచే నామ సంకీర్తన కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఎండూరి సాయిగుప్తా, ఈవో నరసింహమూర్తి పాల్గొన్నారు.
రేపల్లె: పారా లీగల్ వలంటీర్ల నియామకానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


